mettaseema

"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకు ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "

30, ఏప్రిల్ 2012, సోమవారం

జగ్గంపేట లో మే డే వేడుకలు


మే డే వేడుకలు జగ్గంపేట లో జరిగాయి .కార్మికులు ,రైతుకూలీ సంఘాలు ర్యాలి ,పదర్శన నిర్వహించి ,యెర్ర జండాలతోనినదించారు .
వీడీయోmay day video

ఒల్దేజ్ హోం


జగ్గంపేట లోని గోకవరం రోడ్ లో  ఒల్దేజ్ హోం నిర్మిత మవుతోంది .ల యిన్  కోడూరి రంగా రావు ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్హహిస్తున్నారు .ఎలయన్స్ క్లబ్ అధ్వర్యంలో దీనిని నిర్మిస్తున్నారు .అనాధలు అయిన వృద్దులకు ఆశ్రయం కల్పిస్తామని రంగరావు చెప్పారు 

జగ్గంపేట మార్కెట్ కు మామిడి



జగ్గంపేట మార్కెట్ కు మామిడి పళ్ళ సీజన్ వచ్చింది .కాకినాడ రోడ్ లో పలు దుకాణాలు వెలిచాయి.అయితే కార్బైడ్ తో ముగ్గించిన మామిడి మాత్రమె లభ్యమవుతోంది .....తీపిదనం లోనూ తేడా కనిపిస్తోంది ..మంచి మామిడి రావాలంటే ఇంకా వారం రోజులు పట్టవచ్చు 

స్థలాల పై రాజకీయ రగడ

జగ్గంపేట తహసిల్దార్ కార్యాలయం దగ్గర గల స్థలాల పై రాజకీయ రగడ జరుగుతోంది ...కాంగ్రెస్ ,వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు ..అటు బండారు రాజ ,ఇటు మారిసెట్టి బద్రం వర్గీయుల మధ్య విమర్శలు చెలరేగుతున్నై ...అర్హులకు మాత్రేమే షాపులు ఇవ్వడం జరుగుందని రాజ చెపుతుండగా ....ఆ పేర్లు బయట పెట్టాలని భద్రం కోరుతున్నారు .....అది సంగతి 

29, ఏప్రిల్ 2012, ఆదివారం

కురిసిన వాన తో అందరు ఎంజాయ్

ఉక్కపోతతో ఉడికి పోతున్న జనానికి ఉపశమనం జరిగింది ,ఆదివారం సాయత్రం రెండు గంటలపాటు మంచి వర్షం పడింది .....కురిసిన వాన తో అందరు ఎంజాయ్ చేసారు ...భూమి చల్లబడడం తో ఓ రెండు రోజులు పాటు చల్లగా ఉంటుందని జనం ఆనంద పడుతున్నారు ....

18, ఏప్రిల్ 2012, బుధవారం

జగ్గంపేట ఏ డి ఓ నాటి బుజ్జి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు

జగ్గంపేట ఏ డి ఓ నాటి బుజ్జి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు .ఈరోజు ఆమె జగ్గంపేట వస్తుండగా గండేపల్లి సమీపం లో ఆగి ఉన్న లారీని డీ కొట్టారు ...ఆమె స్వయంగా డ్రైవ్ చేస్తునారు ..అదృష్టం కొద్ది డ్రైవింగ్ చేస్తున్న వైపు కాకుండా మరో వైపు భాగం లారి లోకి వెళ్ళడం తో ఆమె సల్ప గాయాలతో బతికి బయట పడ్డారు ...ప్రమాద సమయంలో అటు వైపు వెళ్తున్న నెహ్రు గారి కారు వెళ్ళడం ..వెంటనే ఆమె ను జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రి చేర్చడం జరిగింది ..ఆమె ను పలువురు పర్మార్సించారు ..

14, ఏప్రిల్ 2012, శనివారం

జగ్గంపేట లో అంబేద్కర్ జయంతి వేడుకలు








అంబేద్కర్ జయంతి సందర్బం గా జగ్గంపేట లో పలు కార్యక్రమాలు  జరిగాయి .మంత్రి తోట నరసింహం తో పాటు అన్ని పార్టీల నేతలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలు కొనియాడారు .అలాగే సేవ కార్యక్రమాల్లో పాల్గున్నారు .

10, ఏప్రిల్ 2012, మంగళవారం

కంటి ఆసుపత్రి ఏడాది పూర్తి చేసుకుంది .

జగ్గంపేట లయిన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి  ఏడాది పూర్తి చేసుకుంది .ఉచిత వైద్య సేవలతో ప్రజల మన్ననలు అందుకుంటోంది ,డాక్టర్ బషీర్ అద్వర్యంలో ,,,సభ్యుల సహకారం తో  ముందుకు వెళుతున్నారు ..ఇప్పటికే ఎన్నో సౌకర్యాలు కల్గిన ఈ ఆసుపత్రి ద్వారా మరింత ఎక్కువ మంది ప్రయోజనం పొందాలని ఆశిద్దాం ,

8, ఏప్రిల్ 2012, ఆదివారం

శ్రీ వెంకట నాగ టెక్నో స్కూల్ నందు నూతనం గా స్కేటింగ్ రింగ్ ఏర్పాటు




శ్రీ వెంకట నాగ టెక్నో స్కూల్ నందు నూతనం గా స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేసారు. స్కూల్  అధినేత కురుకూరి రామ చంద్ర రావు అద్వర్యంలో సుమారు ఎనిమిది లక్షల ఖర్చుతో నెలకొల్పిన రింగ్ ను పారిశ్రామికవేత్త  కొత్త భైరవ కృష్ణ ప్రారంబించారు .ఈ సందర్భం గా మాట్లాడుతూ ...జగ్గంపేట పరిసర ప్రాంత పిల్లల ఆనందం కోసం దీనిని ఏర్పాటు చేసామని అన్నారు .తమ స్కూల్ విద్యార్దులతో పాటు ఏ స్కూల్ విద్యార్దులు అయిన స్కేటింగ్ నేర్చు కోవచ్చునన్నారు .ఈ నెల ఇరవై అయిదు తేది నుంచి  నెల రోజుల పాటు అందరికి ఉచితం గా శిక్షణ ఇస్తామని తెలిపారు ..ప్రారంబోత్సవం సందర్భంగా కోచ్ నాగ బాబు చే  ట్రైనింగ్ పొందిన నలబై మంది చిన్నారులు చేసిన స్కేటింగ్ విన్యాసాలు అలరించాయి .వారికి బహుమతులు అందచేసారు .ఈ కార్యక్రమం లో నేతలు మారిశెట్టి భద్రం ,బండారు రాజ ,జీను మణిబాబు,కొత్త కొండబాబు ,గఫూర్ ,ఒమ్మి రఘురాం ,ప్రిన్సిపాల్ దేవదాస్ ప్రబృతులు పాల్గున్నారు video

7, ఏప్రిల్ 2012, శనివారం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం గా జగ్గంపేట వాకర్స్ హెల్త్ క్లబ్




ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం గా జగ్గంపేట వాకర్స్ హెల్త్ క్లబ్ అద్వర్యం లో ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు ,రొట్టెలు పంచిపెట్టారు .కొత్త కొండ బాబు ,శాస్త్రి ప్రబృతులు పాల్గున్నారు .

1, ఏప్రిల్ 2012, ఆదివారం

శ్రీ రామ నవమి

శ్రీ రామ నవమి సందర్భం గా జగ్గంపేట నియోజవర్గం లోని అన్ని గ్రామాల్లో నవమి వేడుకలు ఘనం గ జరిగాయి .జగ్గంపేట పట్టణంలో పోటా పోటి గా కళ్యాణం జరిపించారు