mettaseema

"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకు ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "

28, మే 2012, సోమవారం

అన్న నందమూరి తారక రామారావు జన్మదినం జగ్గంపేట లో

అన్న నందమూరి తారక రామారావు జన్మదినం జగ్గంపేట లో నిర్వహించారు .తెలుగుదేశం పార్టీ అద్వర్యం లో జగ్గంపేట సెంటర్ లో ఉన్న యెన్ టి ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు .స్వీట్స్ పంచిపెట్టారు .కాగ అదే సమయం లో వై ఎస్ ఆర్ పార్టీ నల్ల జండాలతో జగన్ అరెస్టు కు నిరసన చేయడం తో విచిత్ర పర్స్తితి కనిపించింది 

జగ్గంపేట లో ప్రశాంతం గా బంద్

జగ్గంపేట లో ప్రశాంతం గా బంద్  జరుగుతోంది .జగన్ అరెస్ట్ కు నిరసనగా వై ఎస్ ఆర్ పార్టీ పిలుపు నిచ్చిన నేపధ్యం లో బంద్  జరుగుతోంది .అయితే మధ్యాహ్నం రెండు గంటల వరకు సంత కు సడలింపు ఇచ్చ్జారు .కాగ సెంటర్ లో ఆందోళన చేయుస్తున్న జ్యోతుల నెహ్రు ఆయన కుమారుడు ను పెద్దాపురం డి ఎస్ పి  అరెస్ట్ చేసారు .దీంతో  పలువురు కార్యకర్తలు కూడా నెహ్రు తో పాటు జైలు లో కూర్చున్నారు .

27, మే 2012, ఆదివారం

జగన్ అరెస్ట్ పై కార్యకర్తల తో జ్యోతుల మాట వీడియో

జగన్ అరెస్ట్ పై  కార్యకర్తల తో జ్యోతుల మాట  వీడియో jagan arrest ,jyothula speech

సోమవారం జగ్గంపేట నియోజకవర్గం లో బంద్

జగన్ అరెస్ట్ కు నిరసనగా సోమవారం జగ్గంపేట నియోజకవర్గం లో బంద్  చేస్తున్నారు.జగ్గంపేట  రావులమ్మ వద్ద వై   ఎస్ ని యోజవర్గ పార్టీ సమావేశము   జరిగింది .జగన్ అరెస్ట్   నిరసిస్తూ సోమవారం బంద్  చేయించా  లని  జ్యోతుల నెహ్రు    పిలుపు ఇచ్చారు .అనంతరం  ర్యాలీగా వచ్చి పోలీసు స్టేషన్ ముట్టడించారు .దీంతో జ్యోతుల లను   మరికొందరిని అరెస్ట్ చేసి తర్వాత విడుదల   చేసారు 

23, మే 2012, బుధవారం

.జగ్గంపేట లో ఇప్పటి వరకు డబ్బై రెండున్నర కాగ కొత్తగా

పెట్రో ధరలు భగ్గు మన్నాయి .భారీగా పెంచారు .జగ్గంపేట లో ఇప్పటి వరకు డబ్బై రెండున్నర కాగ కొత్తగా పెరిగిన ధరతో  ఎనబై ఒక రూపాయి కంటే ఎక్కువే ...సామాన్యుల పై పెను భారమే .అసలే ఎండలో బళ్ళు వేడికి కొంత పెట్రోల్ ఆవిరి అవుతోంది ....దేనికి తోడూ ధర పెరుగుదల ....

17, మే 2012, గురువారం

ఉచిత కంటి శిబిరం


జగ్గంపేట లోని కోడూరి రంగ రావు లయిన్ కంటి ఆసుపత్రి వారిచే జగ్గంపేట అంబేత్కర్ నగర్ లో ఉచిత శిబిరం నిర్వహించారు .యువజన సంఘం అద్వర్యం లో జరిగిన ఈ శిబిరం లో అరవై మందికి డాక్టర్ బషీర్ వైద్య సేవలు అందించారు 

ఎయిడ్స్ భాదిత చిన్నార్లకు

ఎయిడ్స్ భాదిత చిన్నార్లకు ఈరోజు అన్నదానం  జరిగింది .నాయకం పల్లి గ్రామనికి  చెందిన భావరపు శ్రీరాం జ్ఞాపకార్ధం
అతని తల్లిదండ్రులు ఎయిడ్స్ భాదిత చిన్నార్లకు    అన్నిరకల వంటలతో మంచి భోజనం పెట్టారు .

13, మే 2012, ఆదివారం

12, మే 2012, శనివారం

10, మే 2012, గురువారం

కొత్త కొండబాబు కు "సేవా రత్న " అవార్డ్

 

సేవా కార్య క్రమాల్లో ఎప్పుడూ ముందు ఉండే కొత్త కొండబాబు కు "సేవా రత్న " అవార్డ్ లభించింది .వైజాగ్ లోనే ప్రియ దర్శిని సంస్థ రెండు వేల పన్నెండు కు గాను ఈ అవార్డ్ కు ఎంపిక చేసింది .ఈ నెల పదమూడున కొండ బాబు అవార్డ్ స్వీక రిస్తారు ....మరిన్ని సేవల తో ఆయన ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం

9, మే 2012, బుధవారం

సాక్షి మీడియా పై జరుగుతున్న దాడిని నిరసిస్తు

సాక్షి మీడియా పై జరుగుతున్న దాడిని నిరసిస్తు  ఈరోజు జగ్గంపేట లోఆందోళన జరిగింది .ఏ ఎస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టీ అద్వర్యం లో ..జ్యోతుల నవీన  కుమార్ సారధ్యం లో సెంటర్ లో ధర్నా చేసి సోనియా దిష్టి బొమ్మ తగలబెట్టారు ...సి బి [ కి వ్యతిరేకం గా నినాదాలు చేసారు ....కాగా సాక్షి బాంక్ లావా దేవిలు నిలిపి వేయడాన్ని జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఖండించింది 

3, మే 2012, గురువారం

లారి యూనియన్ నేతలు ధర్నా

జగ్గంపేట ఎస్ ఐ దుర్సుతనం గా వ్యవహ రించి న తీరును ఖండ్డిస్తూ ఈరోజు లారి యూనియన్  నేతలు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేసారు .ఎస్ ఐ పై చర్య తీసుకోవాలని నినదించారు .సి ఐ వచ్చిన పెద్దల తో మాట్లాడి తగిన చర్య తీసు కుంటా మని హామీ ఇవ్వడం తో శాంతిచ్న్హారు ,నిన్న నీలాద్రి రాజు కొడుకు వర్మ తో ఎస్ ఐ గొడవ పడడం తో వివాదం మొదలైంది